Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెజిల్ అడవుల్లోని విష సర్పంతో కరోనాకు విరుగుడు

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:45 IST)
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కరోనాకు విరుగుడుగా ఓ విష సర్పం విషం పనిచేస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసో ( Jararacussu pit viper )కు చెందిన విషంతో కోవిడ్‌19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికను సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్‌లో ప్రచురించారు. 
 
రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు.. కోవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సర్ప విష అణువులు కోతుల్లో 75 శాతం కరోనా వైరస్ కణాల వృద్ధిని నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
 
ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాంతకంగా మారుతున్న కోవిడ్ వ్యాధి నివారణలో వైపర్ స్నేక్ జరారాకుసో విషంలో ఉన్న అణువులు కీలకం కానున్నట్లు భావిస్తున్నారు. సావో పౌలో యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో దీనికి సంబంధించిన వివరణ ఇచ్చారు.
 
వైరస్‌లో రెట్టింపు అవుతున్న ముఖ్యమైన ప్రోటీన్‌ను అడ్డుకోవడంలో జరారాకుసో సర్పంలో ఉన్న అణువులు పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు గుర్తింపు ఉంది. 
 
ఆ పాములు సుమారు రెండు మీటర్ల పొడుగు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. 
 
ఆ సర్పాల్లో ఉండే పెప్‌టైడ్ అణువులను ల్యాబ్‌ల్లోనూ అభివృద్ధి చేయవచ్చు అని రాఫేల్ గైడో తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

యూకేలో హరి హర వీరమల్లూ గ్రాండ్ సెలబ్రేషన్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments