Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఠాగూర్
శనివారం, 21 జూన్ 2025 (22:34 IST)
బ్రెజిల్ దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ గాలిలో ఉండగానే మంటల్లో చిక్కుకుని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరో 13 మంది గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన శనివారం ఉదయం సౌత్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినా రాష్ట్రంలో జరిగింది. 
 
వివరాలను పరిశీలిస్తే, శాంటా కాటరినా రాష్ట్రంలోని ప్రయా గ్రాండే నగరంలో శనివారం తెల్లవారుజామున మొత్తం 21 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరిన ఈ పర్యటాక బెలూన్ మార్గమధ్యంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అంటుకున్న కొద్దిసేపటికే బెలూన్ నియంత్రణ కోల్పోయి వేగంగా భూమిపై కూలిపోయింది.
 
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు నిర్ధారించారు. గాయపడిన 13 మందిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు అగ్నిమాపక శాఖ పేర్కొంది. కాగా, ఈ ఘటనపై స్థానిక ప్రభుత్వ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments