Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పతాగి డ్యాన్స్ చేశారు.. గాల్లోకి కాల్పులు జరిపారు.. 13 ఏళ్ల కుర్రాడిని చంపేశారు..

మ్యూజిక్ విని ఫంక్షన్‌కు వెళ్ళిన 13ఏళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన థానే సమీపంలోనే గైక్వాడ్ పాడలో చోటుచేసుకుంది. వేడుకలకు వచ్చిన ఓ బంధువు తప్పతాగి గాల్లోకి జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలుడు మృత

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:10 IST)
మ్యూజిక్ విని ఫంక్షన్‌కు వెళ్ళిన 13ఏళ్ల పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన థానే సమీపంలోనే గైక్వాడ్ పాడలో చోటుచేసుకుంది. వేడుకలకు వచ్చిన ఓ బంధువు తప్పతాగి గాల్లోకి జరిపిన కాల్పుల్లో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల పిల్లాడికి నామకరణం చేసే ఆ ఫంక్షన్‌ను చూసేందుకు పక్కింటి అబ్బాయి వెళ్ళాడు. అయితే ఆ ఫంక్షన్‌కు వచ్చిన వారంతా తప్పతాగి డ్యాన్స్ చేశారు. వీరిలో ఓ బంధువు గాల్లోకి కాల్పులు జరపడంతో పొరపాటున అక్కడే ఉన్న పక్కింటి బాలుడిపై తీవ్రంగా గాయపడ్డాడు. 
 
అయితే ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు చెప్పకుండా అతడిని ఆస్పత్రికి తరలించారు. వారికి ఆ పిల్లాడు తమ ఇంట్లోని నిద్రపోతున్నాడని నమ్మబలికారు. తీరా ఉదయం బాలుడు చనిపోయిన తర్వాత అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే వారంతా తప్పతాగి డ్యాన్స్ చేస్తూ చివరికి ఇంతటి అఘాయిత్యానికి దిగారని మృతుడి తండ్రి ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ఇంట్లోని సీసీ వీడియో ఫూటేజిలను కూడా ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments