Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌లో కొత్తరకం కరోనా విజృంభణ : మళ్లీ లాక్డౌన్

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (15:26 IST)
బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. దీంతో అప్రమత్తమైన ఆ దేశ ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించింది. లండన్‌తోపాటు దక్షిణ ఇంగ్లండ్‌లో లాక్డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్డౌన్ ఆంక్షలు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.
 
బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. బుధవారం నుంచి నమోదైన కరోనా కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువగానే కొత్తరకం వైరస్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ఈ కొత్తరకం వైరస్‌కు అడ్డుకట్ట వేస్తుందని చెప్పలేమన్నారు. క్రిస్మస్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌లో తాజా ఆంక్షల ప్రభావం పండుగపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బోరిస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. 
 
కరోనా వైరస్ కారణంగా ఈసారి క్రిస్మస్‌ను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూకేలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతోంది. మొదటి వారంలోనే దాదాపు 1.37 లక్షల మందికి తొలి డోసు టీకాను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments