Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - చైనా దేశాల మధ్య టెన్షన్.. టెన్షన్... భారీ సంఖ్యలో బలగాల మొహరింపు

భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మొహరించాయి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలకాలం తర్వాత ఉత్పన్నం కావడం గమనార్హం. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రి కూడల

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (10:23 IST)
భారత్, చైనా దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను మొహరించాయి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలకాలం తర్వాత ఉత్పన్నం కావడం గమనార్హం. సిక్కిం-భూటాన్-టిబెట్ త్రి కూడలి (ట్రై జంక్షన్) వద్ద ఈ పరిస్థితి నెలకొంది.
 
భూటాన్ భూభాగమైన డోక్లం దిశగా త్రికూడలి వరకు చైనా రోడ్డును నిర్మిస్తోంది. 40 టన్నుల బరువును తట్టుకునేలా చైనా ‘క్లాస్-40’ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. దీన్ని భూటాన్ సహా భారత్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురువారం గ్యాంగ్‌టక్‌లోని 17 మౌంటైన్ డివిజన్, కలింపోంగ్‌లోని 27 మౌంటైన్ డివిజన్‌లను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ప్రత్యర్థులిద్దరూ పెద్ద ఎత్తున బలగాలను మోహరించి సెక్యూరిటీని పటిష్టం చేసినట్టు సమాచారం. 
 
తాజా పరిణామాలపై స్పందించేందుకు ఇండియన్ ఆర్మీ నిరాకరించింది. గతంలోనూ దళాలను మోహరించినా ప్రస్తుత పరిస్థితి మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్టు తెలుస్తోంది. 'ప్రస్తుతం తమ దళాలను ఉపసంహరించేందుకు రెండు దేశాలు సిద్ధంగా లేవు. ఇరు దేశాల కమాండర్ల మధ్య ఫ్లాగ్ మీటింగులు, ఇతర చర్చలు ఇప్పటి వరకు జరగలేదు' అని ఆర్మీ వర్గాలు తెలిపాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం