Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసిలో దారుణం.. 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళపై గార్డు అత్యాచారం

పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ మహిళ అత్యాచారానికి గురైంది. అదీ కూడా 70 యేళ్ళ వృద్ధురాలు. ఈమెపై మహిళా గార్డు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెల

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (09:57 IST)
పవిత్ర పుణ్యస్థలం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో ఓ విదేశీ మహిళ అత్యాచారానికి గురైంది. అదీ కూడా 70 యేళ్ళ వృద్ధురాలు. ఈమెపై మహిళా గార్డు అత్యాచానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మహిళల్లో అక్షరాస్యతపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్న 70 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ ఓ గార్డు చేతిలో అత్యాచారానికి గురైంది. వారణాసిలోని మధోపూర్ గ్రామంలో ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు 70 యేళ్ళ ఫ్రెంచ్ మహిళ ఓ ఎన్జీవో సంస్థను నడుపుతోంది. గత 11 నెలలుగా వారణాసిలోని మధోపూర్ గ్రామంలో ఓ రిసార్ట్‌లో నివశిస్తోంది. అయితే, మీర్జాపూర్‌కు చెందిన ఓంప్రకాష్ అనే వ్యక్తి ఆమె ఉంటున్న రిసార్ట్‌‌కు గార్డుగా పనిచేస్తున్నాడు. 
 
బుధవారం రాత్రి తాగిన మత్తులో ఉన్న ఓంప్రకాష్ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేలోపే గార్డు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న మహిళను ఆసుపత్రిలో చేర్చినట్టు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments