Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదృశ్యమైన విమాన శకలాల గుర్తింపు.. 62మంది జలసమాధి

Webdunia
ఆదివారం, 10 జనవరి 2021 (08:27 IST)
ఇండొనేషియలో కుప్పకూలిన స్రివిజయ ఎయిర్ లైన్స్ చెందిన బోయింగ్ విమాన శకలాల్ని అధికారులు గుర్తించారు. బోయింగ్ విమానం జావా సముద్రంలో కుప్పకూలిపోయినట్టు నిర్ధారించారు. ఆ విమాన శకలాల్ని థౌజండ్ ఐలాండ్స్ వద్ద గుర్తించారు. 
 
ఈ ప్రమాదం కారణంగా విమానంలో ప్రయాణించిన 62 మంది ప్రయాణికులు జలసమాధి అయ్యారు. బాధితుల కోసం జాతీయ రవాణా భద్రత కమిటీతో పాటు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజన్సీలు రంగంలోకి దిగాయని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదిత ఐరావతి తెలిపారు. 
 
కాగా, శనివారం 62 మంది ప్రయాణికులతో రాజధాని జకార్తాలోని సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బోయింగ్ 737-500 విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు కోల్పోయింది. స్రివిజయ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఈ విమానం పాంటియానక్ వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో 56 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
 
ఫ్లైట్ రాడార్ 24 అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.... టేకాఫ్ అనంతరం 11 వేల అడుగుల ఎత్తుకు చేరిన ఈ బోయింగ్ విమానం ఒక్కసారిగా 250 అడుగుల ఎత్తుకు జారిపోగా, ఆ తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయి జావా సముద్రంలో కూలిపోయింది. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments