బల్లి చేసే శబ్ధాలు, శరీరంపై బల్లి పడటం ద్వారా ఏర్పడే ఫలితాలను తెలుసుకునేందుకు పూర్వం బల్లిశాస్త్రం వుండేదట. ఇతిహాసాలు, పురాణాల్లో కూడా మనుష్యులకు ఏర్పడే ప్రతికూల ఫలితాలను ముందుగానే బల్లి తెలియజేస్తుందని చెప్పబడివుంది. అలాంటి బల్లి మానవుని తలపై పడితే ఇబ్బందులు తలెత్తవచ్చు. మానసిక ప్రశాంతత వుండదు. కుటుంబంలోనో లేదా బంధువుల ఇంట మృత్యువు సంభవించే అవకాశం వుంది. తలపై బల్లి ఎక్కడ పడినా ఇబ్బందే. ఎడమవైపు పడితే దుఃఖం, కుడివైపు పడితే కలహాలు తప్పవు.
తల జుట్టుపై బల్లిపడితే.. ఏదైనా మేలు జరుగుతుంది. ముఖంపై బల్లిపడితే ఇంటికి అతిథులు వస్తారని తెలుసుకోవాలి. కనుబొమ్మలపై బల్లిపడితే.. పదవీ యోగం వుంటుంది. కంటిపై బల్లి పడితే మాత్రం.. ఏదో మార్గంలో శిక్షకు గురవుతారు.
ఎడమ కాలు లేకుంటే ఎడమ చేతిపై బల్లిపడితే.. ఆ రోజంతా సంతోషకరంగా మారుతుంది. కానీ కుడిచేతిపై కుడి కాలిపై బల్లిపడితే అనారోగ్య సమస్యలు తప్పవు. పాదంపై బల్లిపడితే.. భవిష్యత్తులో విదేశాలకు వెళ్లే అవకాశం వుంటుంది. బొడ్డుపై బల్లిపడితే.. విలువైన వస్తువులు, వైఢూర్యాలు, రత్నాలు పొందవచ్చు. తొడభాగంలో బడి పడితే తల్లిదండ్రులకు అపవాదును తెచ్చిపెడతారు.
వక్షోజాలపై బల్లిపడితే.. ఎడమభాగంపై పడితే సుఖం, కానీ కుడిచేతి భాగంలో పడితే లాభం కలుగుతుంది. గొంతు భాగంలో బల్లిపడితే.. అదీ ఎడమవైపు పడితే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గొంతు కుడివైపు పడితే శత్రుబాధ తప్పదని బల్లిశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.