Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబా వంగా భవిష్యవాణి.. 2023 ప్రపంచానికి డెడ్ లైనా? (video)

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (18:16 IST)
Blind Baba Vanga
బాబా వంగా భవిష్యవాణి భయపెడుతోంది. వచ్చే ఏడాది జ్యోతిష్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఆమె చెప్పిన జ్యోతిష్యాలు ఇప్పటివరకు నిజమైన దాఖలాలు వున్నాయి. ఇందులో ఒకటి అమెరికాకు నల్లజాతీయుడు అధ్యక్షుడు అవుతాడనేది. 
 
తాజాగా 2023 ప్రపంచానికి డెడ్ లైన్ అని బాబా వంగా భవిష్యవాణి చెప్తోంది. ఇప్పటికే 90 శాతం బాబా వంగా జ్యోతిష్యం నిజమైంది. అలాగే బాబా వంగా చెప్పిందే నిజం అవుతుందని ఆమె శిష్యులు అంటున్నారు. బాబా వంగాను దైవదూతగా బల్గేరియా ప్రజలు భావిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని బాబా వంగా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా జీవ ఆయుధాల శకం నెలకొంటుందని బాబా వంగా అన్నారు. వచ్చే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని ఆమె చెప్పారు. బాబా వంగా చెప్పినట్లే ఆస్ట్రేలియాలో ఈ ఏడాది భారీ వరదలు ఏర్పడ్డాయి. 
 
1996లో మరణించిన బాబా వంగా.. 2023లో ఐదు భయానక అంశాలు జరుగనున్నాయని జ్యోతిష్యం చెప్పారు. సహజ జననాల ముగింపు వుంటుందని సౌర సునామీ తప్పదని ఆమె చెప్పారు. 
 
బాబా వంగాను అధికారికంగా వంగేలియా పాండేవా గుష్టెరోవా అని పిలుస్తారు. బల్గేరియాకు చెందిన ఒక ఆధ్యాత్మికవేత్త. మూలికా శాస్త్రవేత్త ఈమె. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియన్ కోజుహ్ హైలాండ్స్‌లోని రూపైట్ ప్రాంతంలో నివసించింది. 
 
మరికొద్ది నెలల్లో, మనం 2023వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె చెప్పిన జ్యోతిష్యం ప్రపంచ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇందులో జీవ ఆయుధాల వాడకం అధికం కానుందని ఆమె చెప్పారు. 
 
అణు విస్ఫోటనం
2023లో తన అనేక ప్రవచనాలలో అణు విద్యుత్ ప్లాంట్ పేలుడు సంభావ్యతను బాబా అంచనా వేసినట్లు చెప్పబడింది. ఉక్రెయిన్‌లో అణు విపత్తు గురించి దేశ నాయకుల ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఈ జోస్యం భయానకంగా ఉంటుంది.
 
ఇంకా 2023లో భూమి యొక్క కక్ష్య మారుతుందని బాబా వంగా పేర్కొన్నారు. ఆ మార్పు ఏమైనప్పటికీ, అది సంభవించినట్లయితే అది వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. 
 
భూమిపై ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సౌర తుఫాను రాబోతోందని వంగా జోస్యం చెప్పారు. బాబా వంగా ప్రస్తావించిన సౌర తుఫానులు మాస్ బ్లాక్‌అవుట్‌లు, కమ్యూనికేషన్ బ్రేక్‌డౌన్‌లకు కారణం కావచ్చు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. వంగా జ్యోతిష్యంతో ప్రస్తుతం ప్రజల్లో ఆందోళనలను మొదలయ్యాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments