Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన ఆవిష్కరణలకు భారత్ ఒక ప్రయోగశాల : బిల్ గేట్స్ కామెంట్స్

bill gates
ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (14:34 IST)
భారత్ ఒక ప్రయోగశాల వంటిదంటూ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి భారత్‌పై తనకున్న అనుబంధాన్ని బిల్ గేట్స్ పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. అయితే, ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. 
 
ఇటీవల జరిగిన రీడ్ హాఫ్‌మన్‌తో పాడ్‌కాస్ట్‌లో బిల్‌గేట్స్‌ పాల్గొని ప్రసంగించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆయన ‘కొత్త విషయాలను పరిశీలించడానికి భారత్ ఓ ప్రయోగశాల’ అంటూ పేర్కొన్నారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ ఆరోగ్యం, పోషకాహారం, విద్యారంగంలో గత 20 ఏళ్లలో భారత్‌ ఎంతో పురోగతి సాధించిందని వ్యాఖ్యానించారు. 
 
యూఎస్ వెలుపల తమకున్న అతిపెద్ద కార్యాలయాలను భారత్‌ భాగస్వామ్యంతోనే నడిపిస్తున్నామని తెలిపారు. భారత్‌ను ఆయన ప్రయోగశాలతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఓ నెటిజన్‌ పోస్టు పెట్టారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలు పాటించకుండానే బిల్‌గేట్స్‌ ఇక్కడ కార్యాలయం నడుపుతున్నారని ఆరోపించారు. 
 
మరో నెటిజన్‌ స్పందిస్తూ... 'బిల్‌గేట్స్‌ మనకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ భారత ప్రభుత్వాన్ని, ప్రజలను ఏమార్చుతున్నారు. భారత ప్రజలను ఆయన లేబొరేటరీల్లో ఉండే శాంపుల్స్‌లాగా భావిస్తారు. వాటివల్ల లాభం ఉందని గుర్తించారు కనుకే వారికి అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని దేశం ఎప్పటికి గుర్తిస్తుందోట' అంటూ విమర్శించారు. మరికొందరు స్పందిస్తూ బిల్‌గేట్స్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం   వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments