Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ట్రంప్ పైన కసితో జో బైడెన్ కి గుద్దేసిన అమెరికన్లు

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (16:42 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో డెమొక్రెటికి అభ్యర్థి జో బైడెన్ గెలుపు దాదాపు ఖరారైంది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో బైడెన్ ముందుకు దూసుకొచ్చారు. ప్రస్తుతం ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు రాగా, బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో ముందంజలో ఉన్నారు.
 
ఇక ఎన్నికల ఫలితాలపై జో బైడెన్ స్పంధించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలువబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసం ఉందని తుది ఫలితం వచ్చేవరకు ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బైడెన్ స్పందిస్తూ ట్రంప్ పైన దాదాపు 40 లక్షల ఓట్ల మెజారిటితో గెలువబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
తమ పార్టీకి 7.5 కోట్ల ఓట్లు పోలయ్యాయని తెలిపారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ వ్యక్తికి కూడా ఇన్ని ఓట్లు పోలవ్వలేదని తెలిపారు. మరో వైపు దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులపై బైడెన్ స్పందించారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతానని బైడెన్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments