Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (12:37 IST)
తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం బద్ధలైంది. దానికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిననట్టు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని
తూర్పు ఇండోనేషియాలోని సుసా టెంగారా ప్రావిన్స్‌లోని విమానాశ్రయాన్ని మూసివేసిట్టు వెల్లడించారు.
 
తూర్పు సుమా టెంగారా ప్రావిన్స్‌లోని లెవోటోబి లకి లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడినట్టు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం సంభవించడంతో ఒక కిమీట ఎత్తులో దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నట్టు తెలిపారు. 
 
ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ యేడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments