Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరో నల్లజాతీయుడి హత్య...

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (12:37 IST)
అగ్రరాజ్యం అమెరికాలో నల్లజాతీయులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. ఇటీవల జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్లజాతీయుడిని పోలీసులు అకారణంగా చంపేసిన విషయం తెల్సిందే. ఈ హత్యతో అమెరికా దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇవి చల్లారకముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ ఘటన నేపథ్యంలో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నగర పోలీసు చీఫ్‌ రాజీనామా చేశారు. రెషార్డ్‌ బ్రూక్ ‌అట్లాంటాలోని ఓ రెస్టారెంటు ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు.
 
ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్‌ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు. 
 
అంతేగాక, ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి  కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments