Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం. నేవీ పైలెట్ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని

అమెరికాలో తెలుగమ్మాయికి అరుదైన గౌరవం. నేవీ పైలెట్ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని
, గురువారం, 21 మే 2020 (22:59 IST)
న్యూ యార్క్: అమెరికాకు వెళ్లిన తెలుగువారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. తమ శక్తియుక్తులతో తెలుగువారికి, అమెరికాకు కూడా మంచి పేరు తెస్తున్నారు. ఈ క్రమంలోనే మన తెలుగమ్మాయి దేవిశ్రీ దొంతినేని అమెరికాలో నేవల్ ఫైలట్ అధికారిణిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర పొన్నూరుకు చెందిన శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవీశ్రీ అమెరికా లోని న్యూయార్క్ లాంగ్ ఐలాండ్‌లో పుట్టి పెరిగింది. 
 
తను పదవ గ్రేడులో ఉన్నప్పుడు మేరీల్యాండ్ లోని అన్నాపోలీస్ నేవీ అకాడమీ సందర్శనకు వెళ్లింది. అక్కడ నేవల్ అధికారిణి తన జీవితంలో సాధించిన విజయాలపై ఇచ్చిన ప్రసంగం ఆమెలో స్ఫూర్తిని నింపింది. ఇదే ఆమె నేవీలో పనిచేయాలనే కలలకు ఊపిరిపోసింది. అప్పటి నేవీలో అడ్మిరల్, ఇప్పటి నార్వే అమెరికా రాయబారి కెన్నెత్ బ్రైత్ ‌వైట్‌ను దేవీశ్రీ తన తల్లిదండ్రులతో పాటు కలిసి తన ఆశయాన్ని వివరించింది. కెన్నెత్ బ్రైత్, దేవీశ్రీకి ప్రోత్సాహం అందించడంతో పాటు.. నేవీలో ఎలా చేరాలనే దానిపై దిశానిర్థేశం చేశారు. కెన్నెత్ ఇచ్చిన స్ఫూర్తితో  దేవీశ్రీ ఆ దిశగా కసరత్తు చేసింది. 
webdunia
2015 వేసవిలో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ (USNA)కు దరఖాస్తు చేసుకుంది. అదే సంవత్సరం డిసెంబర్‌లో అమెరికా నేవీ ఆమె దరఖాస్తును ఆమోదించడం జరిగింది. సైన్యంలో అబ్బాయిలను పంపించడానికే ఒకటికి పదిసార్లు ఆలోచించే తల్లిదండ్రులున్నారు. అలాంటిది అమ్మాయిని పంపించడం ఎలా అని సందిగ్ధంలో ఉన్న తల్లిదండ్రులకు దేవీశ్రీనే నచ్చచెప్పింది. దేశానికి సేవ చేయాలనే తన సంకల్పానికి సహకరించమని కోరడంతో దేవీశ్రీ తల్లిదండ్రులు అందుకు సమ్మతించారు. ప్రస్తుతం నేవీ శిక్షణ పూర్తిచేసుకున్న దేవీ శ్రీ దొంతినేని నేవీ పైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది. 
 
ఇది మన తెలుగమ్మాయి సాధించిన విజయం. ఓ తెలుగమ్మాయి అమెరికాలో ఇలాంటి బాధ్యతలు స్వీకరించడం యావత్ తెలువారందరికి గర్వకారణమైన విషయమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దేవీశ్రీని ప్రశంసించింది. ఆమె భవిష్యత్తులో తన పదవికి వన్నె తెచ్చేలా ఎన్నో విజయాలు సాధించాలని నాట్స్ ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీట్‌రూట్ జ్యూస్‌ను రుచికరంగా ఇలా చేసుకోవచ్చు