Webdunia - Bharat's app for daily news and videos

Install App

40 ఏళ్లలో 44-మంది పిల్లలు- భర్త పారిపోయాడు.. ఉగాండా మహిళ కథ ఏంటంటే?

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:19 IST)
Uganda Woman
ఉగాండా మహిళ గురించి తెలిస్తే అందరూ షాకవుతారు. ఓ ఉగాండా మహిళ 40 ఏళ్లలోపు 44 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఎక్కువమంది పిల్లలు పుట్టడంతో వారిని పోషించలేక భర్త పారిపోవడంతో వారందరినీ ఆమె ఒంటరిగా పెంచుతోంది. ఇప్పుడు ఆమె తన 38 మంది పిల్లలతో - 20 మంది కుమారులు మరియు 18 మంది కుమార్తెలతో నివసిస్తుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఉగాండా నివాసి అయిన 43 ఏళ్ల మరియం నబటాంజీకి... 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పెళ్లి అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు వివాహం చేసి విక్రయించారు. ఆమె 13 సంవత్సరాల వయస్సులో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అరుదైన పరిస్థితి కారణంగా ఒక్కో కాన్పులో నలుగురైదుగురు చొప్పున ఇప్పటివరకు 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. 
 
ఒక్కసారి మాత్రమే ఒక డెలివరీలో ఒక్క బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె 3 సంవత్సరాల క్రితం తన చివరి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 44మందిలో ఆరుగురు పిల్లలు చనిపోయారు. 
 
అయితే ఒక్కో కాన్పులో సుమారు 2, 3 మరియు 4 పిల్లలకు జన్మనివ్వడం ప్రారంభించినప్పుడు, ఆమె ఆందోళన చెంది డాక్టర్ దగ్గరికి వెళ్లింది.
 
ఆమెకు విచిత్రమైన ఆరోగ్య పరిస్థితి ఉందని, దాని కారణంగా ఆమె చాలాసార్లు తల్లి అయినట్లు డాక్టర్ల పరీక్షల్లో తేలింది. ఇతర మహిళలతో పోలిస్తే ఆమె అండాశయాలు అసాధారణంగా పెద్దవిగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని వైద్యులు చెప్పారు. 
 
ఈ పరిస్థితిని హైపర్ అండోత్సర్గము అంటారు. గర్భనిరోధక పద్ధతులు ఆమెకు పని చేయవని వైద్యులు ఆమెకు చెప్పారు. ఈ కారణంగా, వారికి ఒకేసారి చాలా మంది పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments