Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్ ఫ్రెండ్ పై కోపంతో.. విమానం కిటికీ పగలగొట్టేసింది

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (22:19 IST)
బాయ్ ఫ్రెండ్ పై కోపంతో విమానం కిటికీ పగలగొట్టేసిందో అమ్మడు. ఆమె చేష్టలతో అసలుకే ఎసరు వచ్చేలా వుండడంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా దించాల్సి వచ్చింది.

గత నెలలో చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌కావడంతో వెలుగులోకి వచ్చింది. లూంగ్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన దేశీయ విమానంలో మే 25న ఈ ఘటన జరిగింది.

విమాన సిబ్బంది, ప్రయాణికులు వారిస్తున్న వినకుండా లీ (29) అనే యువతి పదేపదే కిటికీ అద్దాన్ని పగలగొట్టేందుకు యత్నిస్తున్న దృశ్యాలు సిసిటివి కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ విషయం పైలెట్‌కు తెలియడంతో సెంట్రల్‌ చైనా ప్రావిన్స్‌లోని జిన్‌బెంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. అనంతరం సిబ్బంది సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఆమెను పోలీసులకు అప్పగించారు.

తన బాయ్ ఫ్రెండ్‌ మీద ఉన్న కోపంతోనే కిటికీ అద్దాన్ని పగుల కొట్టేందుకు యత్నించినట్లు ఆమె తెలిపింది. అయితే తోటి ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం కలిగేలా వ్యవహరించడంతో అమెపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments