Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా భయం: విమానం నుంచి కిందకు దూకిన పైలట్

కరోనా భయం: విమానం నుంచి కిందకు దూకిన పైలట్
, మంగళవారం, 24 మార్చి 2020 (04:36 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు నెలకొన్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలకు అద్దంపట్టే ఘటన దిల్లీ విమానాశ్రయం వేదికగా జరిగింది. విమానంలో కరోనా బాధితుడు ఉన్నాడన్న సమాచారం ప్రయాణికుల్లో వ్యాపించింది.

ఈ నేపథ్యంలో ఆందోళన చెందిన విమాన కో పైలట్.. కిందకు దూకాడు. పుణె నుంచి దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఎయిర్ ఏషియా విమానంలోని ఓ ప్రయాణికుడు కరోనా అనుమానితుడని మరో వ్యక్తికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో గందరగోళం తలెత్తింది. విమానంలోని వారు ఆందోళనకు లోనయ్యారు.

అయితే విమానం నుంచి సాధారణ మార్గం ద్వారా కిందకు దిగాల్సి ఉండగా.. కో-పైలట్ కాక్​పిట్ పక్కనుంచే స్లైడింగ్ విండో ద్వారా కిందకు దూకాడు. ఈ ఘటన దిల్లీ విమానాశ్రయంలో చర్చకు దారి తీసింది. అదే సమయంలో అనుమానితుడు ప్రయాణించిన విమానాన్ని రన్​వేపై వేరుగా నిలిపి ఉంచారు.

ప్రయాణికుల్లో నెలకొన్న ఆందోళనను పరిగణనలోకి తీసుకుని అనుమానితుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే వైద్య పరీక్షల్లో అతడికి కరోనా లేదని తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థిక ఎమెర్జెన్సీ దిశగా దేశం?