Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లింలపై తాత్కాలిక నిషేధం: ట్రంప్ వ్యాఖ్యల్ని తప్పుబట్టిన ఏంజెలీనా జోలీ!

Webdunia
మంగళవారం, 17 మే 2016 (14:33 IST)
అమెరికా దేశానికి అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల్ని కొందరు తప్పుబడుతుంటే.. మరికొందరు ఆయన్ని సమర్థిస్తున్నారు. పారిస్‌లో ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకుని.. ట్రంప్ తాను అధికారంలోకి వస్తే అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధిస్తానని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హాలీవుడ్ ప్రముఖ నటి ఏంజెలినా జోలీ డొనాల్డ్ ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు.
 
దేశానికి అధ్యక్ష పదవి రేసులో ఉన్న ట్రంప్‌ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి తరఫున శరణార్థుల ప్రత్యేక రాయబారిగా ఓ కార్యక్రమంలో ఏంజెలీనా జోలీ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో నుంచి వచ్చిన వలసదారులతో కలిసి ఏర్పడిందే అమెరికా.. అలాంటి దేశానికి అధ్యక్షుడి రేసులో ఉన్న ట్రంప్ ముస్లింలపై నిషేధం వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments