Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా అలాస్కాలో అతిభారీ భూకంపం... ఊగిన గృహాలు

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (10:53 IST)
అమెరికాలోని అలాస్కాలో అతి భారీభూకంపం సంభంవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో గృహాల్లోనివారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం సంభవించగానే అలాస్కా తీరప్రాంతంలో అమెరికా ప్రభుత్వం సునామీ హెచ్చరికలను జారీచేసింది. 
 
అమెరికా జియోలజికల్ సర్వే అధికారులు వెల్లడించిన వివరాల మేరకు... ఈ భూకంపం ఉత్తర యాంకరేజి ప్రాంతానికి 11 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. మొదటి ప్రకంపనలు తర్వాత వరుసగా పలుమార్లు భూమి పొరల్లో 40.9 కిలోమీటర్ల అడుగుభాగాన ఈ ప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. యాంకరేజీ ప్రాంతంలో దాదాపు 3 లక్షలమంది నివసిస్తుండగా మరో లక్షమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. 
 
స్థానికకాలమానం ప్రకారం ఈ భూకంపం ఉదయం 8.29 గంటలకు చోటుచేసుకొంది. ఇంతవరకు 40 సార్లు భూప్రకంపనలు సంభవించినట్టు అలాస్కా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇందులో 10 రిక్టార్ స్కేల్‌పై 4.0గా నమోదుకాగా, 3 సార్లు 7.0గా నమోదయ్యింది. భూకంప ప్రభావంతో కరెంట్‌కు తీవ్ర అంతరాయం కలగటంతో ప్రజలు చీకటిలో మగ్గుతున్నారన్న వార్తలు అందుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments