Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధ విమానాన్ని నడిపిన కృత్రిమ మేథ!!

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (12:05 IST)
సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. తాజాగా కృత్రిమ మేధ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇది ఏకంగా యుద్ధ విమానాన్ని నడిపే స్థాయికి చేరుకుంది. భవిష్యత్ యుద్ధాల్లో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకుంటున్న అమెరికా తాజాగా ఓ యుద్ధ విమానం నడిపే బాధ్యతను ఏఐకి అప్పగించింది. ఈ బాధ్యతను ఏవీ చక్కగా నిర్వర్తించింది. కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్‌లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఏవి నడుపుతున్న ఎఫ్-16 యుద్ధ విమానంలో ఏకంగా ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ కూడా ప్రయాణించి ఏఐ సాంకేతికతను ప్రత్యక్షంగా వీక్షించడం గమనార్హం. 
 
ఈ ప్రయోగంలో భాగంగా సాధారణ పైలట్ నడుపుతున్న విమానంతో ఏఐ విమానం పోటీ పడింది. శత్రువిమానాలపై పైచేయి సాధించేందుకు ఉద్దేశించిన పలు గగనతల విన్యాసాల్లో ఏఐ విమానం సాధారణ పైలట్ విమానానికి గట్టి పోటీ ఇచ్చింది. ఏఐ యుద్ధ విమానంలో ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ సుమారు గంట పాటు ప్రయాణించారు. అనంతరం మీడియా సమావేశంలో ఏవి గురించి మాట్లాడారు.
 
'ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోకపోవడం భద్రతాపరంగా ఓ పెద్ద రిస్క్. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ సాంకేతిక ఉండాల్సిందే' అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయుధాల ప్రయోగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే శక్తి ఈ సాంకేతికతకు ఉందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. ఈ సాంకేతిక ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నప్పటికీ ఏఐకి సంబంధించి అమెరికా ఎయిర్ ఫోర్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మొత్తం 1000 మానవరహిత, ఏఐ ఆధారిత యుద్ధవిమానాల ఫ్లీట్ ఏర్పాటే లక్ష్యంగా అమెరికా ముందడుగు వేస్తోంది. యుద్ధ విమానాల అభివృద్ధిలో కీలక మైలురాయిగా పేర్కొనే స్టెల్త్ టెక్నాలజీ (శత్రు దేశాల రాదార్లకు చిక్కకుండా చేసే సాంకేతికత) ఏఐకి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments