Webdunia - Bharat's app for daily news and videos

Install App

200 మంది విటులకు హెచ్.ఐ.వి రోగాన్ని అంటించిన వ్యభిచారిణి.. ఎక్కడ?

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (13:48 IST)
అమెరికాకు చెందిన ఓ వ్యభిచారిణి 200 మంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టింది. తనకు ఎయిడ్స్ ఉందన్న విషయాన్ని దాచిపెట్టి వందలాది మందితో శృంగారంలో పాల్గొంది. దీంతో వీరందరి ప్రాణాలు ఇపుడు రిస్క్‌లో పడ్డాయి. అయితే, ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ మహిళను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమెతో సన్నిహితంగా ఉన్న విటులందరూ విధిగా హెచ్.ఐ.వి. పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ హెల్త్ అలెర్ట్ జారీచేశారు. ఆమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఈ దారుణం వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
ఓహియోని మరియెట్టాకు చెదిన లిండా లెచెసే అనే సెక్స్ వర్కర్‌కు 2022లో హెచ్.ఐ.వి. సోకింది. వైద్య పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తన పనికి స్వస్తి పలకాల్సిన లిండా అలా చేయలేదు. మరింత మందితో శృంగారంలో పాల్గొంటూ వచ్చింది. 2022 నుంచి ఇప్పటివరకు ఆమె 211 మందితో సన్నిహితంగా గడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో లిండాను అరెస్టు చేసిన పోలీసులు ఆమె కస్టమర్లు 211 మందికి ఫోన్ చేసి విషయం చెప్పారు. 
 
వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతోపాటు తమ దృష్టికి రాని కస్టమర్లు ఇంకా ఎవరైనా ఉంటే చెప్పాలని వారు కోరారు. లిండాకు హెచ్.ఐ.వి ఉందని బయటపడటంతో గతంలో ఆమెతో గడిపిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతూ, వైద్య పరీక్షల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం