మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం
, గురువారం, 14 మార్చి 2024 (18:52 IST)
Kiran Abbavaram and rahasya
హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ గండిపేట్ లోని ఓ రిసార్ట్ లో మిత్రులు, కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కిరణ్ అబ్బవరం, రహస్య నిశ్చితార్థం ఫొటోస్ తో కూడిన పోస్టులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు, నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Kiran Abbavaram and rahasya
మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ విశెస్ చెబుతున్నారు.
Kiran Abbavaram and rahasya
ఆగస్టులో కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించబోతున్నారు. కిరణ్ అబ్బవరం, రహస్య కలిసి రాజా వారు రాణి గారు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ టైమ్ నుంచే కిరణ్ అబ్బవరం, రహస్య ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
తర్వాతి కథనం