స్మార్ట్ ఫోన్ పెళ్ళాం... ప్రపంచంలోనే విచిత్రమైన పెళ్లి!
వరుడు ఆరన్ చక్కగా బ్లాక్ సూటు, కోటు వేసుకొని పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. వధువు కూడా చక్కని కవర్‌లో ఒదిగి ఉంది. ఇద్దరూ ఎదురెదురుగా ఉండగా పెళ్లి పెద్ద మైకేల్ కెల్లీ.. ఇద్దరితో ప్రమాణాలు చేయించాడు. ఆరన్ అనబడే నువ్వు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చట్టబద్ధంగా వి
వరుడు ఆరన్ చక్కగా బ్లాక్ సూటు, కోటు వేసుకొని పెళ్లికొడుకులా ముస్తాబయ్యాడు. వధువు కూడా చక్కని కవర్‌లో ఒదిగి ఉంది. ఇద్దరూ ఎదురెదురుగా ఉండగా పెళ్లి పెద్ద మైకేల్ కెల్లీ.. ఇద్దరితో ప్రమాణాలు చేయించాడు. ఆరన్ అనబడే నువ్వు ఈ స్మార్ట్‌ఫోన్‌ను చట్టబద్ధంగా వివాహం చేసేందుకు సమ్మతిస్తున్నావా?
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రేమిస్తూ గౌరవిస్తూ.. విశ్వసనీయంగా ఉంటూ సుఖంగా చూసుకుంటానని దైవసాక్షిగా వాగ్దానం చేస్తున్నావా? అని ఆరన్‌ని అడిగాడు. అందుకు ఆరన్ సమ్మతించడంతో అంగరంగ వైభవంగా స్మార్ట్‌ఫోన్‌తో అతని పెళ్లి జరిగింది. ఈ తంతు అంతా జరిగింది ఎక్కడో తెలుసా... అమెరికాలోని సిన్ సిటీలో.