తొలి రోజు మోత... రెండో రోజు మూత... ఇదే 'అన్న' క్యాంటీన్‌కు 'అమ్మ' క్యాంటీన్‌కు తేడా...
అమరావతి: చెన్నైని చూసి చేయి కాల్చుకున్నట్లు అవుతోంది. అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటీన్... తొలి రోజు మోత మోగించిన అన్న క్యాంటీన్ రెండో రోజు మూతపడింది. సరిగ్గా 24 గంటల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి,
అమరావతి: చెన్నైని చూసి చేయి కాల్చుకున్నట్లు అవుతోంది. అమరావతిలో ఎన్టీఆర్ క్యాంటీన్... తొలి రోజు మోత మోగించిన అన్న క్యాంటీన్ రెండో రోజు మూతపడింది. సరిగ్గా 24 గంటల క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి, పౌరసరఫరాలశాఖ మంత్రి ఏంతో అర్బాటంగా యన్టీఆర్ క్యాంటిన్ ప్రారంభించారు.. కాని తెల్లావారే సరికే క్యాంటీన్ తెరవలేదు.
రెండవ రోజు సెలవు ప్రకటించారు. గుంటూరు, కృష్టా జిల్లాకు చెందిన వేలాది మంది స్దానికులు అన్నా క్యాంటేన్ పరీశీలించి, 5 రూపాయలకే లభించే పెరుగు అన్నం, రూపాయికి లభించే ఇడ్లీ తినాలని వచ్చారు. కాని వారి ఆశను అడిఆశ చేసారు నిర్వాహకులు. తాత్కలిక సచివాలయంలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు కూడా క్యాంటీన్ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఒక్క రోజు ముచ్చటగా అన్నా క్యాంటిన్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.