Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవ్వింపు చర్యలు వద్దు.. పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (12:10 IST)
పుల్వామా ఉగ్రదాడి, భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరించింది. అలాంటి చర్యలకు పూనుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. 
 
వివరాలలోకి వెళ్తే... పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా భారత్ మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం అమెరికా పాకిస్థాన్‌ని మరోసారి హెచ్చరించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర తండాల విషయంలో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పాక్, భారత్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ సెక్రటరీ మైక్ పోంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
ఈ ప్రకటనలో భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్‌ని కౌంటర్ టెర్రరిజంలో భాగమని అభివర్ణించిన ఆయన పాక్‌పై సునిశిత వ్యాఖ్యలు చేస్తూ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్‌కే నష్టం జరుగుతుందని హితవు పలుకుతూ ఉగ్రవాదంపై తీరు మార్చుకోవలసిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు. 
 
భారత్‌పై కవ్వింపు చర్యలు తగవని కూడా హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీకి సూచించారు. ఫిబ్రవరి 26 దాడులపై తాను భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానని.. సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు తోడ్పాటునందిస్తామని చెప్పినట్టు ప్రెస్‌నోట్‌లో మైక్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments