Webdunia - Bharat's app for daily news and videos

Install App

టచ్ చేస్తే.. విరుచుకుపడతాం : ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (09:31 IST)
తమను టచ్ చేస్తే విరుచుకుపడతాం అంటూ... ఇరాన్‌కు అమెరికాకు హెచ్చరించింది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ హెచ్చరిక చేశారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ - అమెరికా దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. హెచ్చరికలు, జవాబులతో పరిస్థితి మరింత వేడెక్కింది. మళ్లీ దాడులకు తెగబడితే ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. అయితే, అమెరికాకు అంత దుమ్ములేదని ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ రహీం బదులిచ్చారు. 
 
ఇరాన్‌ ఎంపీ ఒకరు ఏకంగా శ్వేతసౌధంపైనే దాడి చేస్తామని హెచ్చరించడం గమనార్హం. శనివారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఎలాంటి దాడులకు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ‘‘ఇరాన్‌లోని 52 కీలక ప్రాంతాలను గుర్తించాం. వాటిలో కొన్ని ఇరాన్‌కు, ఆ దేశ సంస్కృతికి అత్యంత ప్రధానమైనవి కూడా ఉన్నాయి. అమెరికా పౌరులు, ఆస్తులపై ఇరాన్‌ దాడికి పాల్పడితే ఆ 52 లక్ష్యాలపై దాడులు తప్పవు’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. 
 
చాలా ఏళ్ల కిందట ఇరాన్‌ 52 మంది అమెరికన్లను నిర్బంధించిన విషయాన్ని గుర్తుచేస్తూ ట్రంప్‌ 52 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ‘‘వాళ్లు(ఇరాన్‌) మాపై దాడి చేశారు. మేం ప్రతి దాడి చేశాం. ప్రతీకార దాడులు వద్దని చెప్పా. అయినా అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నామని చాలా ధైర్యంగా చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు మళ్లీ దాడికి పాల్పడితే మాత్రం ఇంతకుముందెన్నడూ చేయని రీతిలో ప్రతిదాడి చేస్తాం’’ అని ట్విటర్‌లో హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments