Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (12:23 IST)
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది అక్కడి స్థానిక కోర్టు. దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేయడమే అతడు చేసిన నేరం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్ అనే స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూయార్క్‌లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే కావాలనే 66 కంప్యూటర్లలో యూఎస్బీ కిల్లర్ డివైజ్‌ని ఇన్సర్ట్ చేశాడు.
 
ఈ డివైజ్‌ని కంప్యూటర్‌లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడు కంప్యూటర్‌లోని ఆన్‌బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటు పదే పదే డిశ్చార్జ్ అయ్యేలా ఒక అలర్టును పంపుతుంది. దీంతో యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడవుతాయి. విశ్వనాథ్ ఫిబ్రవరి 14వ తేదీన ఇలా చేశాడు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 22వ తేదీన విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా… ఏడాది పాటు జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments