Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఫ్గాన్‌ను ప్రపంచం వదిలేసింది: ఓ యువ‌తి భావోద్వేగం

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (18:36 IST)
అఫ్గానిస్థాన్ పూర్తిగా తాలిబన్ ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లిపోయింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విదేశాలకు పారిపోయాడు. అధ్యక్ష భవనాన్ని తాలిబన్ ప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో అఫ్గాన్‌ నుంచి విదేశాలకు వెళ్లేవాళ్లు వందల, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొందరు ఆ దేశం నుంచి బయటపడ్డారు. అలా ఢిల్లీకి వచ్చిన ఓ యువతి చాలా భావోద్వేగంతో మాట్లాడింది.

ప్రపంచమంతా అఫ్గాన్‌ను ఇలా వదిలేస్తారని అనుకోలేదని కంటతడి పెట్టుకుంది. ‘‘అఫ్గాన్‌ను ప్రపంచమంతా ఏకాకిలా వదిలేయడాన్ని నేను నమ్మలేకపోతున్నా.. ఆ దేశంలో ఉండిపోయిన నా స్నేహితులు తాలిబన్ల చేతిలో చిక్కి ప్రాణాలు కోల్పోతారన్న ఆలోచనను తట్టుకోలేకపోతున్నా.

 అక్కడ ఉన్న మహిళలకు ఇకపై ఎలాంటి రక్షణ, హక్కులు ఉండబోవు” అని ఎంతో ఆవేదనతో ఆ యువతి మాట్లాడింది. కాబూల్‌ నుంచి ఆ యువతి ఈ రోజు తెల్లవారుజామున ఫ్లైట్‌లో ఢిల్లీకి చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజర్ టీజ‌ర్ రిలీజ్‌కు 11 చోట్ల భారీ స‌న్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments