Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాణభయంతో పారిపోతున్న ప్రజలు : పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్న తాలిబన్లు

Advertiesment
Taliban Terrorists
, మంగళవారం, 17 ఆగస్టు 2021 (13:51 IST)
ఆప్ఘనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు ఇపుడు కాబూల్ నగరంలో ఎంజాయ్ చేస్తున్నారు. పార్కులు, పబ్బులు, అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు, ఆదేశ ప్రజలు మాత్రం ప్రాణభయంతో దేశం విడిచి పారిపోతున్నారు. 
 
కాబూల్ నగరంలో వీధులు, రోడ్లపై మహిళలు కనిపించి నాలుగు రోజులకు పైగా అవుతుంది.  స్థానికంగా హక్కులకోసం పనిచేసే ఓ మహిళ సోమవారం మీడియాకు తెలిపారు. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తాలిబన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎవరు పనులు వారు చేసుకోవచ్చని తెలిపింది.
 
ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి వణికిపోతుంటే.. తాలిబన్లు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. పార్కులలో ఆటవస్తువులతో ఆడుతున్నారు. కార్లలో ఎక్కి చక్కర్లు కొడుతున్నారు. జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం పార్క్ ట్రాయ్ కార్లు నడుపుతూ కేకలు వేశారు. దీంతోపాటు జిమ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
ఈ వీడియోలు చాలా ఫన్నీగా ఉన్నాయి. తాలిబన్లు చిన్నపిల్లలా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. కాబుల్ నగరంలో కొంతమంది నగరంలోని అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు వెళ్లి అక్కడ ట్రాయ్ కార్లలో తిరుగుతూ, చెక్క గుర్రాలపై రౌండ్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక ప్రెసిడెంట్ భవనంలో చిందులు వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవా బీచ్‌లో అర్థనగ్నంగా మహిళ మృతదేహం