Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ అంశంలోకి మమ్మల్ని లాగొద్దు : పాక్‌కు తేల్చి చెప్పిన ఆప్ఘాన్

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (13:27 IST)
కాశ్మీర్ అంశంలోకి తమను లాగొద్దని పాకిస్థాన్‌కు అప్ఘనిస్థాన్ తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దుతో అప్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పాకిస్థాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అప్ఘనిస్థాన్ ఒకింత ఘాటుగానే స్పందించింది. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అప్ఘాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశానికి హితవు పలికింది. 
 
ఈ మేరకు అమెరికాకు అప్ఘానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ ఓ లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. 'అమెరికాకు పాకిస్థాన్‌ రాయబారి అసద్‌ మజీద్‌ ఖాన్‌ అఫ్గానిస్థాన్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. దీనిపై గట్టిగా ప్రశ్నిస్తున్నాం. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు అఫ్గానిస్థాన్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయన్న వారి వ్యాఖ్యలు అర్థరహితం. పాక్‌కు అప్ఘాన్‌ నుంచి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. 
 
ముఖ్యంగా, పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ వేలాంది మంది మిలటరీ బృందాలను ఎందుకు పెట్టిందో మాకు సరైన కారణం కనిపించడంలేదు. పాకిస్థాన్‌లో ఉండే ఉగ్రవాదుల నుంచి అప్ఘాన్‌కు తరచూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మా దేశం వైపు ఉసిగొల్పేలా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒక వేళ ఇందులో పాక్‌ పాత్ర లేకపోతే బహిరంగంగా దీనిపై మాట్లాడాలి. ఉగ్రవాదంపై కఠిన చట్టాలను అమలు పరచాలి' అని లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments