Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా యూనివర్శిటీలో గర్ల్ ఫ్రెండ్ కోసం యువకుడు అప్లికేషన్

ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క ''పెళ్లి కాని ప్రసాద్"లు ఎక్కువైపోతున్నారు. ఎక్కడికెళ్లినా చాలామంది అబ్బాయిలకు ఓ పట్టాన సంబంధాలు సెట్ కావడం లేదు. దీనితో చాలామంది ముందుజాగ్రత్త చర్యగా కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడిపోయి పెళ్లితో సెటి

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (15:17 IST)
ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరక్క ''పెళ్లి కాని ప్రసాద్"లు ఎక్కువైపోతున్నారు. ఎక్కడికెళ్లినా చాలామంది అబ్బాయిలకు ఓ పట్టాన సంబంధాలు సెట్ కావడం లేదు. దీనితో చాలామంది ముందుజాగ్రత్త చర్యగా కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడిపోయి పెళ్లితో సెటిల్ అయిపోతున్నారు. ఐతే ఓ యువకుడు కాలేజీ దాటేసి, పెళ్లి కోసం తంటాలు పడుతూ ఎలాగైనా ఓ అమ్మాయిని బుట్టలో వేయాలని డిసైడ్ అయ్యాడు. 
 
ఐతే కాలేజీ దాటేసిన అతడికి మహిళా యూనివర్శిటీ దిక్కయ్యింది. దీనితో ఏం చేయాలో పాలుపోక ఏకంగా గర్ల్ ఫ్రెండ్ కోసం మహిళా యూనివర్శిటీకే అప్లికేషన్ పెట్టుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌ను సెట్ చేసుకోవడమే తన లక్ష్యమని కూడా అప్లికేషన్లో స్పష్టంగా తెలియజేశాడు. అడ్మిషన్ ఇంటర్వ్యూలో తాను ఉమెన్స్ వర్సిటీకి ఎందుకు అప్లై చేశాడో చక్కగా వర్ణించి చెప్పడంతో ఇంటర్వ్యూ ప్యానెల్ కూడా అతడి లక్ష్యానికి ఫిదా అయిపోయారట. 
 
మరో రౌండ్ పూర్తయితే ఇక అతడికి అక్కడ సీటు దొరికినట్లే. విషయం ఏమిటంటే.. ఆ యూనివర్శిటీలో ప్రతి ఏడాది ఓ మేల్ స్టూడెంట్ కి అడ్మిషన్ ఇస్తారట. ఆ కోటాలో ఈ యువకుడు పట్టేసుకోవాలని చూస్తున్నారు. ఈ యూనివర్శిటీ చైనా రాజధాని బీజింగ్‌లో ఉన్న చైనా ఉమెన్స్ యూనివర్సిటీ.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments