ఇంగ్లీష్ చక్కగా మాట్లాడినా చితక్కొడుతారు... ఎక్కడ?
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేనా, ఇతర నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ నగరం రాజధానిగా మారింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడినందుక
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. అంతేనా, ఇతర నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఈ నగరం రాజధానిగా మారింది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఇంగ్లీషులో చక్కగా మాట్లాడినందుకు ఐదుగురు వ్యక్తులు రౌండప్ చేసి చితకబాదారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
పోలీసుల కథనం ప్రకారం.. 22 యేళ్ళ గులాటి అనే యువకుడు కన్నాట్ ప్లేస్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద తన స్నేహితుడు దక్ష్‌ను దిగబెట్టి... అతడితో కాసేపు ఇంగ్లీష్‌లో మాట్లాడి తిరిగి బయలుదేరాడు.
ఇది చూసిన ఐదుగురు వ్యక్తులు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడినందుకు అతడితో వాగ్వాదానికి దిగారు. ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. అతడిని రౌండప్ చేసి దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఓ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే వాహనం నంబరును గుర్తుపెట్టుకున్న గులాటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నంబరు ఆధారంగా నిందితులను గుర్తించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.