Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంగిపోతున్న న్యూయార్క్ నగరం.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (14:50 IST)
అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క నగరం కుగిపోతుంది. ఎటుచూసినా ఆకాశహార్మ్యాలతో ప్రపంచ దేశాలను ఆకట్టుకునే న్యూయార్క్ నగరానికి ఇపుడు ఆ ఆకాశహార్మ్యాలే శాపంగా మారాయి. తాజాగా వెలువరించిన ఓ అధ్యయనంలో ఇదే విషయం వెల్లడైంది. ఇక్కడి బహుళ అంతస్తుల భవనాల బరువు.. నగరాన్ని కుంగిపోయేలా చేస్తోందని అధ్యయనం పేర్కొంది. అమెరికా జియాలాజికల్ సర్వే సంస్థ, యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్‌లోని జియాలజిస్టులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు 'ఎర్త్ ఫ్యూచర్ జర్నల్'లో ప్రచురితమయ్యాయి.
 
పరిశోధకులు మొదటగా న్యూయార్క్ నగరాన్ని చతురస్రాకార గ్రిడ్లుగా విభజించారు. ఈ క్రమంలోనే దాదాపు పది లక్షలకుపైగా భవనాలు ఉన్నాయని తేల్చారు. వాటి బరువు దాదాపు 85 కోట్ల టన్నుల వరకు ఉంటుందని లెక్కగట్టారు. ఈ క్రమంలోనే నగరం ఏటా 1- 2 మిల్లీ మీటర్ల మేర వేగంతో కుంగిపోతోన్నట్లు గుర్తించారు. నేల స్వభావం, ఉపగ్రహ సమాచారాన్ని విశ్లేషించి ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. 
 
అప్పటికీ.. రోడ్లు, కాలిబాటలు, వంతెనలు, రైల్వేలు, చదును ప్రదేశాల ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోలేదు. లోయర్ మాన్హాటన్, బ్రూక్లిన్, క్వీన్స్ తదితర ప్రాంతాలు వేగంగా కుంగిపోతున్నట్లు అధ్యయనంలో తేలింది. 'ఉత్తర అమెరికాలో అట్లాంటిక్ తీరం వెంబడి సముద్ర మట్టాల పెరుగుదల ప్రపంచ సగటుకన్నా 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో న్యూయార్క్ నగరంలోని 84 లక్షల జనాభాకు.. ముంపు ముప్పు పొంచి ఉంది' అని యూఎస్ఓఎస్‌కే చెందిన ప్రధాన పరిశోధకుడు, భూగర్భ శాస్త్రవేత్త టామ్ పార్సన్స్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments