Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్‌లో ఉండగా రిపోర్టర్‌కు ఫిట్స్ వచ్చింది.. ఎలా చనిపోయిందో చూడండి (వీడియో)

పాకిస్థాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. దీంతో రిపోర్టర్ చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం తానింకా బతికే వున్నానంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. ప

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (12:40 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయింది. దీంతో రిపోర్టర్ చనిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం తానింకా బతికే వున్నానంటూ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ న్యూస్ ఛానెల్ 'టీవీ 92'లో రిపోర్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న ఇర్జా ఖాన్ అనే యువ‌తి చ‌నిపోయిందంటూ జోరుగా ప్రచారం సాగింది. లైవ్ నుంచి కిందపడిపోయిన మాట నిజమేనని.. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందాక తిరిగి ఇంటికొచ్చానని చెప్పింది. 
 
నిక్షేపంగా వున్న స‌ద‌రు యువ‌తి స్పందిస్తూ... తాను బ‌తికే ఉన్నాన‌ని.. తన‌కు సంబంధించిన వీడియో ఒక‌టి విప‌రీతంగా వైర‌ల్ అవుతోంద‌ని, అది ఓ పాత వీడియో అని, దాన్ని చూస్తూ అంతా తాను చ‌నిపోయాన‌ని అనుకుంటున్నార‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వాపోయింది.
 
ఇంతకీ ఏం జరిగిందంటే? ఇర్జా ఖాన్ ఏడాది క్రితం త‌మ చానెల్ త‌ర‌ఫున‌ ఓ కార్యక్రమం కవరేజ్ కోసం ఇస్లామాబాద్‌ వెళ్లింది. ఆ కార్య‌క్ర‌మ ప్రాంగ‌ణం మొత్తం కనిపించడం కోసం క్రేన్‌పై కూర్చొని లైవ్‌లో మాట్లాడుతోంది. ఒక్క‌సారిగా అస్వస్థతకు గురై ఫిట్స్ వచ్చి పది అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది.

అనంత‌రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వ‌చ్చేసింది. ఈ సంద‌ర్భంగా కెమెరాకు చిక్కిన ఓ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియో చూసినవారంతా ఇర్జా ఖాన్ మరణించిందని పోస్టులు పెడుతున్నారు. ఎలా చ‌నిపోయిందో చూడండ‌ని వీడియోను షేర్ చేస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments