Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోహోర్ పులాయ్ నదిలో కూలిన విమానం

ఠాగూర్
శుక్రవారం, 11 జులై 2025 (10:29 IST)
మలేషియాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఆ దేశంలోని జోహోర్ పులాయ్ నదిలో ఒక పోలీస్ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన జరిగినట్లు మలేషియా పౌర విమానయాన శాఖ తెలిపింది. 
 
మలేషియాతో కలిసి సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌‍ మిత్సతోమ్ 2025 పేరుతో బహుపాక్షిక అణు భద్రతా పరిశోధనా కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రారంభకార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన పలు బృందాలు పాల్గొన్నాయి.
 
ఈ క్రమంలో తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన ఎయిర్ బస్ (ఏఎస్ 355 ఎన్ హెలికాప్టర్) బయలుదేరింది. అయితే, ఇది గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్‌మెంట్ ఏజెన్సీ (ఎంఎంఈఏ) జెట్టీ సమీపంలోకి వచ్చిన వెంటనే ప్రమాదానికి గురై నదిలో
పడిపోయింది.
 
ఈ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి పైలట్‌‍తో సహా ఐదుగురిని రక్షించాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments