Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:45 IST)
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం సృష్టించింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లోని క్రైస్తవ పాఠశాలలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు 400 మంది విద్యార్థులు ఉండే అబండెంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూల్లో ఈ ఘటన జరిగినట్లు మాడిసన్ పోలీస్ విభాగం సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
ఈ ఘటనపై మాడిసన్ పోలీసు చీఫ్ షాన్ బర్న్స్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ సంఘటనలో కనీసం ఐదుగురు చనిపోయారని తెలిపారు. ఈ ఘటనకు 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి కారణమైనట్లు గుర్తించామన్నారు. అలాగే గాయపడిన ఐదుగురిని చికిత్స కోసం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు బర్న్స్ పేర్కొన్నారు. ఈ ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
 
ఇక ఈ ఘటన నేపథ్యంలో మరోసారి అమెరికాలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో పాఠశాలలో కాల్పుల సంఖ్య పెరిగింది. కే-12 స్కూల్ షూటింగ్ డేటాబేస్ వెబ్‌సైట్ ప్రకారం.. అమెరికాలో ఈ యేడాది 322 పాఠశాలలో కాల్పులు చేసుకున్నాయి. 1966 నుంచి ఏ సంవత్సరంలోనైనా ఇది రెండవ అత్యధికం. గతేడాది మొత్తం 349 కాల్పులతో అగ్రస్థానంలో ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments