Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన 300 మంది వలసదారులు

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (14:20 IST)
అట్లాంటింక్ మహాసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మూడు పడవల్లో వెళుతున్న 300 మంది వలసదారులు సముద్రంలో గల్లంతయ్యారు. వీరంతా 15 రోజుల క్రితం సెనెగల్ నుంచి స్పెయిన్‌లోని కానరీ ఐలాండ్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఒక బోటులో 200 మంది, మిగిలిన రెండు బోట్లలో 65, 60 మంది చొప్పున ఉన్నట్టు వలసదారులకు సాయం చేసే వాకింగ్ బోర్డర్స్ సంస్థ తెలిపింది. ఇపుడు ఈ అదృశ్యమైనవారు ఏమయ్యారో అంతుచిక్కడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 
 
ఇటీవలి కాలంలో ఆఫ్రికా నుంచి కానరీ ఐలాండ్స్‌కు వలసదారులు తరలివెళ్లడం సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా, వేసవి కాలంలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. గత యేడాది 22 మంది చిన్నారులతో సహా 559 మంది కానరీ ఐలాండ్స్‌కు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. గత యేడాది ఇదే విధంగా వలసలు వెళుతూ 1,784 మంది చనిపోయినట్టు ఐరాస తెలిపింది. అయితే, అంతకుముందు యేడాదితో పోల్చితే ఈ సంఖ్య 30 శాతం మేరకు తగ్గిందని స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments