Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు ముక్కలైన విమానం... ప్రయాణికులంతా క్షేమం?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (12:18 IST)
ఇస్తాంబుల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ల్యాండ్ అవుతున్న విమానం ఒకటి మూడు ముక్కలైపోయింది. ఆసమయంలో విమానంలో ఏకంగా 183 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు ప్రయాణికులు కోల్పోగా, మరో 179 మంది గాయపడ్డారు. వీరంతా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఈ విమాన ప్రమాదం ఇస్తాంబుల్‌లో జరిగింది. పెగాసస్ ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై అదుపుతప్పి రన్ వే నుంచి జారిపోయింది. ఆ సమయంలో విమానానికి మంటలు అంటుకున్నాయి. 
 
ఆ సమయంలో విమానం మూడు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 179 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు క్రూ సిబ్బంది ఉన్నారు. 
 
ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ను టర్కిష్ టెలివిజన్ ప్రసారం చేసింది. ఇందులో ముక్కలైన విమానం నుంచి పలువురు ప్రయాణికులుపైకి ఎక్కి వస్తుండటం కనిపించింది. భారీ వర్షం, బలమైన గాలుల నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments