Webdunia - Bharat's app for daily news and videos

Install App

నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడుల.. 20మంది మృతి

Webdunia
మంగళవారం, 11 మే 2021 (12:45 IST)
ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నార్త్ గజాపై ఇజ్రాయెల్ దళం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో హమాస్ కమాండర్‌తోపాటు 20 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్‌ రాజధాని నగరం జెరూసలెంలోని అల్-ఆక్సా మసీదు ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ పోలీసులు, పాలస్తీన పౌరుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇజ్రాయెల్ పోలీసులపై పాలస్తీనావాసులు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు.
 
ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. జెరూసలేంలో కొన్ని వారాలుగా పాలస్తీనావాసులు, ఇజ్రాయెల్ భద్రతా దళాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. 
 
ఈ క్రమంలో గజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్, పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్లతో దాడులకు దిగారు. దాంతో ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడిగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 20 మంది వరకు మరణించారు.
 
మృతుల్లో 9 మంది చిన్నారులతోపాటు ఓ సీనియర్ హమాస్ కమాండర్ కూడా ఉన్నారు. జెరూసలెంలో జరిగిన ఘర్షణల్లో 305 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారు. 228 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాలస్తీనియన్ల రాళ్ల దాడుల్లో 21 మంది పోలీసులు గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments