Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇజ్రాయిల్‌ తొక్కిసలాటలో 44 మంది మృతి... ఆనందంలో డాన్స్ చేస్తూ...?

ఇజ్రాయిల్‌ తొక్కిసలాటలో 44 మంది మృతి... ఆనందంలో డాన్స్ చేస్తూ...?
, శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:54 IST)
Israel-stampede
ఇజ్రాయిల్‌లోని మౌంట్ మెరిన్ పవిత్ర స్థలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. లాగ్ బౌమర్ పండుగ సందర్బంగా వేలాది మంది యూదులు మెరిన్ కు ప్రార్థనల కోసం తరలి వచ్చారు. ఈ సమయంలో అక్కడ పాట కచేరి నిర్వహించారు. అందరు ఉత్సాహంగా గెంతులేస్తున్న సమయంలోనే షెడ్ పై కప్పు కూలిపోయింది. దీంతో వెనక ఉన్నవారు ముందుకు పరుగులు తీశారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. 
 
ఈ తొక్కిసలాటలో మొత్తం 44 మంది మృతి చెందినట్లు హిబ్రూ మీడియా తెలిపింది. 38మంది మృతి చెందినట్లుగా రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో 30 మంది తీవ్రంగా గాయపడగా వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉండాలని తెలిపారు వైద్యులు.
 
మెరిన్ లో యూదుల మతగురువు రబ్బీ షిమోన్ బార్ యోహై సమాది ఉంది ఆయనకు నివాళి అర్పించేందుకు ప్రతి ఏడు లక్షల్లో ప్రజలు వస్తుంటారు. గతేడాది కరోనా కారణంగా చాలా తక్కువమంది వచ్చారు. 
 
కానీ ఇజ్రాయిల్ దేశంలో ఈ ఏడాది కరోనా నిబంధనలు తొలగించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మతగురువుకు నివాళ్లు అర్పించేందుకు వచ్చారు. వీరంతా ఆనందంలో డాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా షెడ్‌పై కప్పు కూలినట్లు స్థానిక మీడియా చెబుతుంది. ఈ నేపథ్యంలోనే బయటకు వెళ్లేందుకు పరుగులు తియ్యగా తొక్కిసలాట జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు.
 
అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని సఫెడ్‌లోని జివ్‌ హాస్పిటల్‌, నహరియాలోని గెలీలీ మెడికల్‌ సెంటర్‌, హైఫాలోని రాంబం హాస్పిటల్‌, టెబెరియాస్‌లోని పోరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో సుమారు లక్ష మంది వరకు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. దుర్ఘటనను ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు అతిపెద్ద విషాదంగా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆజ్ తక్ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానా కరోనాతో కన్నుమూత