Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో అర్థరాత్రి ఘోరం ప్రమాదం - 17 మంది మృతి - 22 మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (12:09 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత జియాంగ్సి ప్రావిన్స్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో పలు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో 17 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై క్లారిటీ రావాల్సివుంది. 
 
నానా చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు... పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదనిస, అందువల్ల వాహనదారులు మరింత జాగ్రత్తతో వాహనాలు నడపాలని సూచించారు. ముందు ప్రయాణిస్తున్న వాహనానికి తగినంత దూరంలో ఉండేలా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అలాగే లైన్ మారడం లేదా ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడం వంటివి చేయరాదని సూచించారు. 
 
దట్టమైన పొగమంచు వల్ల రోడ్డు సరిగా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకోవడం చైనాలా సర్వసాధారణంగా మారింది. ఇటీవల హెనాన్న ప్రావిన్స్‌లోని ఓ వంతెనపై సుమారు 200 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ సమయంలో కూడా పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments