జార్ఖండ్ రాష్ట్రంలోని పలామూ డివిజన్‌లో నలుగురు చిన్నారులను చంపేసిన చిరుతను బంధించేందుకు స్థానిక అటవీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఆ చిరుతను మాత్రం బంధించలేక పోతున్నారు. దీంతో ఆ చిరుతను కాల్చి చంపేందుకు హైదరాబాద్ నగరానికి చెందిన షార్ప్ షూటర్ నవాబ్ షఫత్ అలీఖాన్ సిద్ధమవుతున్నారు.
పలామూ డివిజన్‌లో 50 గ్రామాల ప్రజలను వణికిస్తున్న ఈ చిరుతను పట్టుకునేందుకు సిద్ధమైంది. లేదా కాల్చి చంపాలని నిర్ణయించారు. దీంతో సూర్యాస్తమయం తర్వాత ప్రజలు ఎవ్వరూ బయటతిరగొద్దని అటవీ శాఖ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. పైగా, చిరుతను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటుచేశారు.
ఇదిలావుంటే, చిరుతను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ షూటర్ నవాద్ షఫత్‌ను జార్ఖండ్ అటవీ శాఖ అధికారులు సంప్రదించారు. చిరుతకు మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని, వీలుపడని పక్షంలో చంపేస్తామని తెలిపారు.
ఇందుకోసమే నవాబ్‌ను సంప్రదించామని, ఆయన వద్ద అత్యాధునిక సామాగ్రి ఉన్నట్టు జార్ఖండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డన్ శశికర్ సమంత తెలిపారు. తమ కోరిక మేరకు ఆయన త్వరలోనే ఇక్కడకు చేరుకుంటారని తెలిపారు.