Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వివాహాల్లో డ్యాన్సులు - మ్యూజిక్ పార్టీలపై నిషేధం.. ఉల్లంఘిస్తే ఫైన్

Advertiesment
marriage
, మంగళవారం, 29 నవంబరు 2022 (09:24 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాధ్ జిల్లాలో ముస్లిం మతపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ముస్లిం ఇళ్లలో జరిగే వివాహాల్లో డ్యాన్సులు, మ్యూజిక్ పార్టీలపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే మాత్రం రూ.5100 అపరాధం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పైగా, రాత్రి 11 గంటలత ర్వాత నిఖా జరిపించినా జరినామా తప్పదని తేల్చి చెప్పారు. డాన్సులు, మ్యూజిక్ పార్టీలు ఇస్లామ్ మత సంప్రదాయానికి విరుద్ధమని మత పెద్దలు స్పష్టం చేశారు. 
 
నిర్సా బ్లాక్‌లోని సిబిలిమడీ జామా మసీదు ప్రధాన ఇమామ్ మౌలానా మసూద్ అక్తర్ ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడిచారు. డిసెంబరు 2వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇస్లాం మత విధానానికి అనుగుణంగా వివాహాలు జరగాలని తాము ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. 
 
అందువల్ల ఇకపై నిఖా (పెళ్లి)లో డ్యాన్సులు, మ్యాజిక్ పార్టీలు వంటివి ఉండరాదని, టపాసులు పేల్చరాదని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై 5100 రూపాయల అపరాధం విధిస్తామని తెలిపారు. వాస్తవానికి ఇస్లాం మతంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పారు. ఇది ప్రజలకు తీవ్ర అసౌకర్యంగా ఉంటుందని అందువల్ల వీటిని నిషేధిస్తున్నట్టు ఆయన వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మిసెస్ ఆసియా' విజేతగా విశాఖకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి