Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్ పోటీలు.. 1300 మందిని ఓడించిన భారత విద్యార్థి!

అంతర్జాతీయ గణిత పోటీ (ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్)లో భారత విద్యార్థి సత్తా చాటాడు. ఈ పోటీల్లో 1300 మంది విద్యార్థులను 14 యేళ్ళ విద్యార్థి ఓడించి విజేతగా నిలిచాడు.

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (10:53 IST)
అంతర్జాతీయ గణిత పోటీ (ఇంటర్నేషనల్ మ్యాథ్స్ కాంపిటీషన్)లో భారత విద్యార్థి సత్తా చాటాడు. ఈ పోటీల్లో 1300 మంది విద్యార్థులను 14 యేళ్ళ విద్యార్థి ఓడించి విజేతగా నిలిచాడు. 
 
అబాకస్ లెర్నింగ్ ఆఫ్ హయ్యర్ అర్థమెటిక్(ఏఎల్ఏహెచ్ఏ) ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇండోనేషియలో ఈనెల 24న అంతర్జాతీయ గణిత పోటీ నిర్వహించింది. 18 దేశాలకు చెందిన 1,300 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. భారత్ తరపున అహ్మదాబాద్‌లోని హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాల విద్యార్థి తుషార్ తలావత్(14) కూడా పాల్గొన్నాడు. 
 
తన అద్భుత ప్రతిభతో అందరినీ ఓడించి విజేతగా నిలిచాడు. తుషార్ గెలుపుతో గురుకుల పాఠశాల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన తుషార్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల జడివాన కురుస్తోంది.
 
గతేడాది అక్టోబరులో గుజరాత్‌లో నిర్వహించిన పోటీలో 70 ప్రశ్నలకు కేవలం మూడు నిమిషాల్లో సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ పోటీలో తుషార్ 5,300 మందిని ఓడించాడు. చెన్నైలో గత డిసెంబరులో జరిగిన జాతీయస్థాయి పోటీలో 4,300 మందిని ఓడించి విజేతగా నిలిచాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments