Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయువ్య పాకిస్థాన్‌‍లో జంట పేలుళ్లు.. 13 మంది మృత్యువాత

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (10:41 IST)
వాయువ్య పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల దాటికి 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కౌంటర్ టెర్రరిజం అధికారులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. పేలుళ్లు జరిగిన సమయంలో ఆఫీసు పక్క నుంచి నడుచుకుంటూ వెళుతున్న తల్లీ కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ అహ్మద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
ఈ ఘటనను ఆయన తొలుత ఆత్మాహుతి దాడిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత సోమవారం రాత్రి మరో ట్వీట్ చేస్తూ, ఈ పేలుళ్లకు కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారని చెప్పారు. 
 
ఇదిలావుంటే స్వాత్ లోయతో పాటు చుట్టు పక్కల ప్రాంతాలు గతంలో ఇస్లామిస్ట్ మిలిటెంట్ల ఆధీనంలో ఉండేది. 2009లో మిలిటరీ ఆపరేషన్ నిర్వహించి ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ టెర్రరిజం కార్యాలయంతో పాటు ఆయుధగారాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు దీన్ని లక్ష్యంగా చేసుకుని ఈ జంట పేలుళ్లు సంభవించడం గమనార్హం.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments