ప్రపంచంలో ప్రతి 4 కొవిడ్‌ మరణాల్లో 1 భారత్‌లో: వారాంతపు నివేదికలో వెల్లడించిన WHO

Webdunia
బుధవారం, 5 మే 2021 (23:01 IST)
జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి విలయానికి భారత్‌ వణికిపోతోంది. గత కొన్నివారాలుగా కరోనా కొనసాగుతున్న విజృంభణకు నిత్యం వేల సంఖ్యలో కొవిడ్‌ బాధితులు మృత్యుఒడికి చేరుతున్నారు. గతవారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్‌లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటుచేసుకున్న ప్రతి నాలుగు కొవిడ్‌ మరణాల్లో ఒకటి భారత్‌లోనే ఉందని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.
 
‘ఆసియాలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 90శాతం కేవలం భారత్‌లోనే నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాటిలో ఇది 46శాతం. ఇక ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తోన్న మొత్తం కొవిడ్‌ మరణాల్లో 25శాతం భారత్‌లోనే ఉంటున్నాయి’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ గతవారపు నివేదికలలో వెల్లడించింది.

ఇక ఇప్పటివరకు అత్యధిక కొవిడ్‌ మరణాలు (5లక్షల 78వేలు) అమెరికాలో చోటుచేసుకోగా బ్రెజిల్‌ (4లక్షల 11వేలు) రెండో స్థానంలో ఉంది. భారత్‌లో రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు 4లక్షలకు చేరడం, నిత్యం మూడున్నర వేల మంది మృత్యువాతపడుతున్నారు. భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్న విషయం తెలిసిందే.
 
కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం, భారత్‌లో కొవిడ్‌ కేసుల సంఖ్య 2కోట్లు దాటగా, మరణాల సంఖ్య 2లక్షల 26వేలు దాటింది..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments