Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగకు సిద్ధమైన గృహాల కోసం ఏడు రోజులలో వేగవంతంగా ఇంటికి నూతన అందం

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (19:03 IST)
సంవత్సరాంతం తనతో పాటుగా ఎదురుచూడటానికి మరియు ఆనందించేందుకు అనేక పండుగలు తీసుకువస్తుంది. మనం ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ చూసిన పండుగలను స్వాగతించడానికి, మనం స్వర్గసీమగా భావించే ఇంటికి సరికొత్త హంగులద్దాలనీ కోరుకునే సీజన్‌ ఇది. ఓ ఇల్లును అందమైన గృహంగా మార్చడానికి ఎంతో శ్రమిస్తుంటాం.


ఫర్నిచర్‌ను సర్దడం మొదలు, గోడలకు రంగులు వేయడం నుంచి మనసుకు నచ్చిన ఫ్లోరింగ్‌ను ఎంచుకోవడం, మీ ఇంటికి ఉన్న సీలింగ్‌ను అందంగా తీర్చిదిద్దడం వరకూ అన్ని అంశాలూ మీ ఇంటికి పునరుజ్జీవింపజేయడానికి, వాటిని పండుగకు సిద్ధంగా మలచడానికి తోడ్పడతాయి.

 
అయితే, మనలో చాలామంది హోమ్‌రెనోవేషన్‌ ప్రాజెక్ట్‌లను సాధ్యమైనంత వరకూ తప్పించుకోజూస్తారు. ఎందుకంటే అవి అత్యధికంగా సమయం తీసుకోవడంతో పాటుగా అసౌకర్యమూ కలిగిస్తాయి. కానీ సరైన ప్రణాళిక, సృజనాత్మక ఇంటీరియర్‌ డిజైన్‌ ఆలోచనలతో సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే సమయం కోసం గృహాలను సమూలంగా మార్చవచ్చు. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను అందుకునే రీతిలో ఇంటీరియల్‌ డిజైన్‌ ఉండటం అత్యంత కీలకం. కానీ, ఈ ప్రక్రియలో  మీ లివింగ్‌ స్పేస్‌లో అత్యంత కీలకమైన కొన్ని భాగాలను మాత్రం అసలు మరిచిపోకూడదు. అలాంటి ఓ అత్యంత కీలకమైన అంశం  సీలింగ్‌.

 
సీలింగ్‌, అత్యవసరమైన 5వ గోడ: చాలా వరకూ సందర్భాలలో, సీలింగ్స్‌ను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఏదైనా ఇంటీరియర్‌ స్పేస్‌ను అలంకరించడం లేదా పునః అలంకరించడం చేయాలనుకుంటే సాధారణంగా గోడలు, ఫ్లోర్స్‌ మీద అధికంగా శ్రద్ధ చూపుతుంటారు. మీ అభిరుచులకు తగినట్లుగా అంశాలను మార్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ, సీలింగ్స్‌ సైతం మీ ఇంటిలోని వాతావరణాన్ని ఆహ్లాదీకరించడంలో అతి కీలకమైన పాత్రను పోషిస్తాయి.

 
ప్రత్యేకమైన, సున్నితమైన, అద్వితీయ అందం మీ ఇంటికి లభించాలంటే సీలింగ్‌ చక్కటి తోడ్పాటునూ అందిస్తుంది. తమ ఇంటి ఐదవ గోడకు సౌందర్యం అందించేందుకు చాలామంది డిజైనర్‌ కృత్రిమ సీలింగ్స్‌ను ఎంచుకుంటుంటారు. ఎలాంటి ఇంటీరియర్‌కు అయినా  చూపులపరంగా గణనీయమైన ప్రభావాన్ని అవి చూపుతాయి. ప్రస్తుతం, బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు మరియు ఆఖరకు ఆర్కిటెక్ట్‌లు డిజైన్‌ ప్రక్రియ ఆరంభం నుంచి డిజైన్డ్‌ ఫాల్స్‌ సీలింగ్స్‌ వినియోగాన్ని నొక్కి చెబుతున్నారు.

 
సీలింగ్‌ మిత్రుడు: ఓ ఇంటి యజమానిగా, గణనీయంగా మీ ఇంటీరియర్స్‌కు పునఃరూపకల్పన చేయడమన్నది అత్యంత ఖర్చుతో కూడిన అంశంగా కనిపించవచ్చు. అయితే, పని పూర్తిచేయడానికి, మీ ఇంటి సీలింగ్‌ పునఃరూపకల్పన చేయడానికి మీ బ్యాంక్‌లో నిల్వ చేసిన నగదును మొత్తం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. అయితే, మీ పునరుద్ధరణ ప్రాజెక్ట్‌లో నమ్మకమైన భాగస్వామి అవసరం ఉంది. సెయింట్‌ గోబైన్‌ జిప్రోక్‌ దీని కోసం మీ భావోద్వేగాలు, బడ్జెట్‌ మరియు గడువు తేదీలను అందుకునే రీతిలో సమగ్రమైన క్యాటలాగ్స్‌ను అభివృద్ధి చేసింది. కేవలం ఏడు రోజులలో మీ సీలింగ్‌కు నూతన అందాన్ని ఇవి అందించనున్నాయి.

 
జిప్సం సీలింగ్‌ ఖర్చు కేవలం ఒక అంశం మీద మాత్రమే కాదు నాలుగు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి, డిజైన్‌ అవకాశాలు, ఇన్‌స్టాలేషన్‌ ఖర్చు, రవాణా మరియు కూలీ ఖర్చులు. ఈ అంశాలన్నీ గుణించిన తరువాత, ఈ ఖర్చు సాధారణంగా చదరపు అడుగుకు 60-100 రూపాయల నడుమ ఉంటుందని భావించవచ్చు. అయితే, ఇదంతా కూడా మీరు సంప్రదించిన ఇంటీరియర్‌ డిజైనర్లపై ఆధారపడి ఉంటుంది. మీ లివింగ్‌ స్పేస్‌కు సంబంధించి అత్యుత్తమ డిజైన్‌ ఎంచుకునేందుకు తగిన మార్గనిర్దేశకత్వం కూడా  జిప్రోక్‌ మీకు చేస్తుంది. ఇదంతా కూడా సహేతుకమైన, అందుబాటు ధరలలోనే అందిస్తుంది. ఈ ఫలితంగానే, సీలింగ్స్‌ దగ్గరకు వచ్చేసరికి మీకు అత్యంత నమ్మకమైన మిత్రునిగా జిప్రోక్‌ నిలుస్తుంది.

 
సౌందర్యానికి అతీతంగా: జిప్సం బోర్డులను వినియోగించి సీలింగ్స్‌ డిజైనింగ్‌ దగ్గరకు వచ్చేసరికి, మీకు ఎంచుకునేందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. మీ సీలింగ్స్‌ కోసం విభిన్న ఆకృతులతో మీరు ప్రయోగాలు చేయడం మాత్రమే కాదు, మీ లివింగ్‌ స్పేస్‌కు నాటకీయతనూ జోడించవచ్చు. ఆకర్షణీయమైన ఫినీష్‌ను అందించడం ద్వారా మీ ప్రోపర్టీ యొక్క అందం ఇది మెరుగుపరుస్తుంది. డిజైనర్‌ సీలింగ్స్‌తో  సౌందర్యం మెరుగుపడటమే కాదు, పలు ప్రయోజనాలు సైతం ఇవి అందిస్తాయి. మీరు ఎయిర్‌ కండీషనర్‌ వినియోగించే అవసరాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా  వేసవిలో విద్యుత్‌బిల్లులను సైతం తగ్గిస్తాయి.

 
ఉదాహరణకు మీ గది 12X12 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందనుకుందాం. మీ ఫాల్స్‌ సీలింగ్‌, వాస్తవ సీలింగ్‌కు ఒక అడుగు కిందకు ఉంటుంది. దీనివల్ల 1 క్యూబిక్‌ స్పేస్‌ను తగ్గిస్తుంది. లేదంటే మీ ఏసీ ఆ ప్రాంతాన్ని కూడా చల్లబరచవలసి వస్తుంది. విద్యుత్‌ పరంగా ఇది ఆదా అవుతుంది. ఇతర ప్రయోజనాలలో సమానంగా కాంతి పంపిణీ, గజిబిజిగా ఉన్న వైర్లు, పైపులు దాయబడటం, ఫాల్స్‌ సీలింగ్‌ సహాయంతో గదుల నేపథ్యం/మూడ్‌ను అవసరాలకు తగినట్లుగా మార్చుకోవడం వంటివి ఉన్నాయి. ఈ వ్యాపారంలో సుప్రసిద్ధమైనది జిప్రోక్‌. ఇది వాల్‌ డెకార్‌, ఫాల్స్‌ సీలింగ్స్‌కోసం విస్తృతశ్రేణిలో అవకాశాలను అందిస్తుంది. ఈ ఫాల్స్‌ సీలింగ్స్‌ అతి తేలికగా ఉండటంతో పాటుగా మన్నికైన మెటీరియల్స్‌ అయినటువంటి జిప్సం లాంటి వాటితో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇవి కనీసం రెండు దశాబ్దాల పాటు సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటుగా సులభంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడమూ వీలవుతుంది మరియు విభిన్నమైన డిజైన్లలో ఇవి లభిస్తాయి.

 
ఇప్పటికి దాదాపుగా రెండేళ్లుగా ఇంటి వద్దనే మనం ఉండిపోయాము. గతానికన్నా మిన్నగా హోమ్‌డెకార్‌కు ప్రాధాన్యత పెరిగింది. వరుసగా రెండవ పండుగ సీజన్‌ను కూడా ఇంటి వద్దనే గడుపబోతున్నాం. పండుగ సంతోషాన్ని స్వాగతించడానికి మరియు నూతన ఆరంభానికి ప్రతీకగా మన ఇంటినీ మార్చుకోవాల్సి ఉంది. ఈ పండుగ సీజన్‌ కోసం డెకార్‌లో సరైన మార్పులు చేయడం ద్వారా దీనికి సరైన సమాధానం చెప్పగలం. అందువల్ల, వేడుకల కోసం ఈ శీఘ్ర పరిష్కారాన్ని అమలు చేయండి, అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్సవాలకు జీవం పోయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

తర్వాతి కథనం
Show comments