Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు మేలు చేసే మష్రూమ్ ఎగ్ తయారీ ఎలా?

Webdunia
మంగళవారం, 10 మే 2016 (16:48 IST)
మహిళలకు మష్రూమ్ ఎంతో మేలు చేస్తుంది. గర్భసంచికి ఎంతో మేలు చేసే మష్రూమ్‌లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇంకా ఐరన్, క్యాల్షియం, తక్కువ కెలోరీలను డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కూడా తీసుకోవచ్చు. అలాంటి మష్రూమ్‌తో పిల్లలకు నచ్చేలా మష్రూమ్‌ ఎగ్‌ తయారీ ఎలా చేయాలో ట్రై చేద్దామా.. 
 
కావల్సినవి: 
కోడిగుడ్లు - ఐదు, 
పుట్టగొడుగులు - పావుకేజీ (సన్నగా తరగాలి), 
సగం కాల్చినచపాతీలు - ఆరు, 
పాలకూర - పావుకప్పు, 
చీజ్‌ తరుగు - రెండుకప్పులు, 
ఉల్లిపాయ - ఒకటి (తరగాలి), 
వెల్లుల్లి తరుగు - అరచెంచా, 
కొత్తిమీర తరుగు - చెంచా, 
ఆలివ్‌ నూనె - పావుకప్పు, 
ఉప్పు- తగినంత, 
మిరియాల పొడి - అరచెంచా, 
వెన్న - పావుకప్పు. 
 
ఎలా తయారు చేస్తారు? 
కోడిగుడ్లలోని సొనను ఒక పాత్రలోకి తీసుకుని బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేసి పొయ్యి మీద పెట్టాలి. అందులో ఉల్లిపాయ ముక్కలూ, వెల్లుల్లి తరుగు వేయాలి. అవి వేగాక పుట్టగొడుగు ముక్కలు, కోడిగుడ్ల మిశ్రమం వేసి కాసేపు వేయించాలి. తర్వాత పాలకూర తరుగూ, ఉప్పూ వేయాలి. 2 నిమిషాలయ్యాక కొత్తిమీర తరుగూ, మిరియాల పొడీ వేసి దించేయాలి. 
 
ఇప్పుడు ఒక చపాతీని తీసుకుని దాని మీద వెన్న రాసుకోవాలి. తర్వాత పాలకూర మిశ్రమాన్ని పూతలా రాయాలి. ఆపైన చీజ్‌ తరుగూ పరిచి మధ్యకు మడవాలి. ఇప్పుడు పాన్‌ను పొయ్యి మీద పెట్టి స్టఫ్‌ చేసిన చపాతీని మళ్లీ పొయ్యిమీద ఉంచి... మిగిలిన నూనె వేసుకుంటూ రెండువైపులా కాల్చుకోవాలి. తర్వాత కావాలనుకుంటే వీటిని ముక్కలుగానూ కోసుకోవచ్చు. అంతే మష్రూమ్ ఎగ్ సిద్ధమైనట్టే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments