పగటి నిద్ర ఆరోగ్యానికి హానికరమా? కునుకు తీయడానికి ఏ సమయం బెస్ట్!

Webdunia
మంగళవారం, 10 మే 2016 (08:42 IST)
ప్రతి ఒక్కరూ ఏమాత్రం కాస్తంత వీలు చిక్కినా ఓ చిన్నపాటి కునుకు తీసేందుకు ఇష్టపడుతారు. ముఖ్యంగా.. పగటి పూట ఈ అలవాటు అధికంగా ఉంటుంది. ఓ చిన్నపాటి కునుకుతో పని చేయడం వల్ల ఏర్పడిన అలసట పూర్తిగా మటుమాయమై పోతుంది. అలాగే, మెదకుతో పాటు... ఇతర శరీర అవయవాలకు కూడా కాస్తంత చురుకుదనం తెచ్చిపెడుతుంది. 
 
నిజానికి కునుకు తీయటానికి సరైన సమయమంటూ ఏదీ లేదు గానీ.. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య పడుకోవటం ఉత్తమం. సాధారణంగా ఈ సమయంలోనే మన మనసులో నిద్ర వస్తుందన్న భావన కలుగుతుంది. అదేసమయంలో ఓ కునుకు తీయాలనుకునేవారు చిట్టి చిట్కాలు పాటిస్తే ఎంతో శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి. 
 
వీలు చిక్కింది కదా అని మధ్యాహ్నం సమయంలో ఎక్కువ సేపు నిద్రపోకూడదు. ఎక్కువ సేపు కునుకు తీయడం వల్ల శరీరం మగతగా అనిపిస్తుంది. పైగా, చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అలాగే, రాత్రిపూట నిద్రను కూడా దెబ్బతీస్తుంది. అందువల్ల వీలైనంత తక్కువ సేపు నిద్రపోవడం అన్ని విధాలా అనుకూలం. 
 
సాయంత్రం వేళల్లో నిద్రకు దూరంగా ఉండటమే మంచిది. నిద్రలేమి, శ్వాససంబంధిత సమస్యలతో బాధపడేవారు పగటిపూట నిద్రపోకపోవటం ఉత్తమం. పగటినిద్రతో వీరిలో సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయేవారికి పగటి నిద్ర అవసరమే రాదు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కోర్టులో భర్తను కాలితో ఎగిరెగిరి తన్నిన భార్య, నవ్వుతూ తన్నులు తిన్న భర్త (video)

గద్వాల్‌లో దారుణం : మైనర్ కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి

భూపాలపల్లి హాస్టల్‌లో అమానుషం - విద్యార్థిని చితకబాదిన వార్డెన్

బెంగాల్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేయలేదు.. కారణం దీదీనే : అమిత్ షా

Pawan Kalyan: కొండగట్టులో పవన్ కల్యాణ్.. రూ.35కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బీజీ బ్లాక్‌బస్టర్స్ నిర్మాణ సంస్థ ను ప్రకటించిన బండ్ల గణేష్

Allu Aravind: ఆది సక్సెస్ అయితే సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను : అల్లు అరవింద్

మలయాళ నటుడు మోహన్ లాల్‌కు మాతృవియోగం

Beauty: ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యూటీ స్ట్రీమింగ్ జీ 5లో

క్రికెటర్లు వెంట పడుతున్నారు.. వారితో డేటింగ్ చేయడం ఇష్టంలేదు : ఖుషీ ముఖర్జీ

తర్వాతి కథనం
Show comments