Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పులిహోర.. ఎలా చేయాలో తెలుసా?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (21:27 IST)
సాధారణంగా మనం చింతపండు, నిమ్మకాయలతో పులిహోర చేసుకుంటూ ఉంటాం. కేవలం ఇవే కాకుండా మామిడి తురుముతో కూడా పులిహోర తయారుచేసుకోవచ్చు. ఇది తినటానికి రుచిగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో సి విటమిన్
పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
బియ్యం- పావుకిలో
మామిడికాయ తురుము- కప్పు
పసుపు- పావు టీ స్పూను
ఉప్పు- తగినంత
నూనె -2 టేబుల్ స్పూన్లు
ఆవాలు- టీ స్పూన్
శెనగపప్పు- టేబుల్ స్పూన్
మినపప్పు- టేబుల్ స్పూన్
ఎండుమిర్చి- 4
ఇంగువ- చిటికెడు
పచ్చిమిర్చి-4
పల్లీలు- పావుకప్పు
కరివేపాకు- 2 రెబ్బలు
 
తయారుచేసే విధానం..
బియ్యం ఉడికించి ప్లేటులో ఆరనివ్వాలి. టీ స్పూన్ నూనెలో పసుపు వేసి కలపాలి. విడిగా ఓ బాణాలిలో నూనె వేసి శెనగపప్పు, మినపప్పు,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఆవాలు వేసి వేయించి పోపు చేయాలి. అవి వేగాక పల్లీలు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే మామిడికాయ తురుము వేసి కలిపి వెంటనే దించేసి అన్నం మిశ్రమంలో కలిపితే మామిడికాయ పులిహోర రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

నోరూరించే హైదరాబాద్ బిర్యానీ.. నాణ్యత జారిపోతోంది..

సరోగసీ కోసం హైదరాబాదుకు.. లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్య

"ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments